‘బాహుబలి’ వంటి సినిమా చేయాలనుందట!

దూసుకెళ్తా చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న వీరుపోట్ల ప్రస్తుతం సునీల్ ను హీరోగా
పెట్టి ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు
రానుంది. ఈ సంధర్భంగా వీరుపోట్ల మాట్లాడుతూ.. సునీల్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా
నిలుస్తుంది. కామెడీతో పాటు సినిమాలో త్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. ఈ సినిమా గురించి మాత్రమే
కాకుండా మరిన్ని విషయాలను తెలియజేస్తూ.. నాకు బాహుబలి వంటి సినిమాలు చేయడం
చాలా ఇష్టమని చెప్పారు. చరిత్రలోకి వెళ్ళి ఆ కాలం నాటి సినిమాలు చేయాలనే కోరిక ఎప్పటినుండో
ఉందని ఆయన పేర్కొన్నారు. బాహుబలి వంటి సినిమా చూసిన తరువాత అలాంటి సినిమా చేయాలని
ఎందరో దర్శకులు అనుకున్నారు. వారి లిస్ట్ లో వీరు పోట్ల కూడా ఉన్నాడు. మరి ఆయన
కల ఎప్పుడు నెరవేరుతుందో.. చూడాలి !

CLICK HERE!! For the aha Latest Updates