‘వంగవీటి’లో వర్మ పార్ట్ ఇంతేనా..?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా చేసిన సంచలనమే.. తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలు చేయాలంటే వర్మ తరువాతే ఎవరైనా.. రీసెంట్ గా ఆయన విజయవాడలో జరిగిన యధార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని ‘వంగవీటి’ అనే చిత్రాన్ని రూపొందించారు. నిజానికి ఇండస్ట్రీలో ఒకరి పనితనానికి మరొకరు పేరు పెట్టుకోవడం అత్యంత సహజం. కొరటాల శివ కూడా గతంలో తనను రచయితగా ఉపయోగించుకున్న బోయపాటి శ్రీను క్రెడిట్ ఇవ్వలేదంటూ.. ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇచ్చాడు.

అయితే ఇప్పుడు వర్మ కూడా అలానే ఒకరి కష్టానికి తన పేరు వేసుకున్నాడనే టాక్ నడుస్తోంది. వంగవీటి కథ సిద్ధం చేసుకున్న వర్మ కథను బట్టి సగం సినిమా రియల్ లొకేషన్స్ లోనూ.. అలానే కొన్ని సన్నివేశాలు ముంబైలో సెట్స్ వేసి అక్కడ కొంత భాగం చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన డెబ్బై శాతం షూటింగ్ వర్మ దగ్గర చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే ఓ వ్యక్తి చిత్రీకరించినట్లు సమాచారం. వర్మ కేవలం ముంబైలో కొంత భాగం మాత్రమే షూట్ చేసినట్లు టాక్. సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా హిట్ అయితే వర్మ ఆ క్రెడిట్ లో కొంత భాగం అయినా.. తన అసిస్టెంట్ డైరెక్టర్ కు ఇస్తాడేమో… చూడాలి!