HomeTelugu Trendingమరోసారి పూరి-బాలయ్య కాంబినేషన్‌ రిపీట్‌

మరోసారి పూరి-బాలయ్య కాంబినేషన్‌ రిపీట్‌

Balakrishna movie with Puri
నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌ లో ఇప్పటికే ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చేస్తున్నారు. దీని తర్వాత బాలకృష్ణ చేసే చిత్రం పూరి దర్శకత్వంలోనేనని అంటున్నారు. ఇటీవల తాను ఓ స్టార్ హీరో కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నానని పూరి ప్రకటించాడు. అది బాలయ్య కోసమేనని, ఇప్పటికే బాలయ్య ఈ స్క్రిప్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ చిత్రాన్ని చేస్తున్నారు. దీని చివరి షెడ్యూలు షూటింగ్ త్వరలో జరుగుతుంది. దీని తర్వాత ఆయన బాలకృష్ణ చిత్రంపైనే వర్క్ చేస్తారని టాక్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu