హీరోయిన్‌ల దుస్తుల పై బాలసుబ్రహ్మణ్యం ఆగ్రహం.!

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో వేదికపై బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘ఈరోజుల్లో కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు నటీమణులకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలియడం లేదు. ఈ విషయం తెలియకపోవడం వారి అమాయకత్వం అనాలో లేక ఇలాంటి దుస్తులు వేసుకొస్తే సినిమాల్లో అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారేమో. నా వ్యాఖ్యలపై నటీమణులకు కోపం వచ్చినా ఫర్వాలేదు. చాలా మందికి తెలుగు అర్థంకాదు కాబట్టి వారికి నా మాటలు అర్థంకావనే అనుకుంటున్నాను’ అని వెల్లడించారు. దాంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ విషయంపై ఏ ఒక్క సెలబ్రిటీ స్పందించలేదు.