పెదరాయుడు రేంజ్ లో బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. సినిమాను అనౌన్స్ చేసిన రోజే రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. కానీ పూరీ, బాలయ్య కాంబినేషన్ అంటే మొదట అందరికీ ఆశ్చర్యమేసింది. నేటి తరం హీరోలను డైరెక్ట్ చేసే పూరీ, బాలకృష్ణను ఎలా చూపించబోతున్నాడా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్యను ‘పెదరాయుడు’ సినిమా తరహా పాత్రలో చూపించడానికి రెడీ అవుతున్నాడట పూరీ. గతంలో పూరీ, పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రెండు, మూడు కథలు సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడట. ఆ కథలు బాలయ్యకు వినిపించగా.. అతనకు సెట్ అయ్యే పవర్ ఫుల్ కథను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య ఊహించినంత హిట్ ను ఈ సినిమా ద్వారా పూరీ ఇస్తాడో.. లేదో.. చూడాలి!