HomeTelugu Trendingఎన్టీఆర్‌తో విభేదాలపై స్పందించిన బండ్ల గణేష్‌

ఎన్టీఆర్‌తో విభేదాలపై స్పందించిన బండ్ల గణేష్‌

Bandla ganesh gave clarity

బండ్ల గణేష్ నిర్మాతగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ‘బాద్‌ షా’, ‘టెంపర్‌’ వంటి చిత్రాలను నిర్మించాడు. అయితే టెంపర్‌ మూవీ అనంతరం రెమ్యునరేషన్‌ విషయంలో ఎన్టీఆర్‌కి, బండ్ల గణేష్‌తో గొడవ జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్యా దూరం పెరిగిందంటూ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ పారితోషికం విషయంలో బండ్ల మాట మార్చడంతో వారి మధ్య తేడా వచ్చినట్లుగా చెప్పుకున్నారు. అయితే తాజాగా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ

విషమయై క్లారిటీ ఇచ్చారు. ‘అన్నదమ్ముల మధ్య వచ్చిన చిన్నచిన్న మనస్పర్థలను గొడవలు అని అనలేం.. ఇది కూడా అలాంటిదే. మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల అలా జరిగింది. ఎన్టీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు’ అని బండ్ల గణేష్‌ క్లారిటీ ఇచ్చారు. కాగా టెంపర్‌ మూవీ అనంతరం తాత్కాలికంగా బ్రేక్‌ ఇచ్చిన బండ్ల గణేష్‌ మళ్లీ నిర్మాతగా ట్రాక్‌లోకి వచ్చాడు. పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!