‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నుంచి ‘ఇస్పెషల్‌’ దుస్తులు అమ్మకం

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఈ చిత్ర బృందం నుంచి అభిమానుల కోసం ‘ఇస్పెషల్‌’ దుస్తులు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాకి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్‌లుగా.నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ, ఛార్మి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.‌ జులై 12న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రంలో రామ్‌ మాస్‌ హీరో పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో ఆయన పాత్ర, డైలాగ్‌ డెలివరీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతగా రామ్‌ తనను తాను పాత్ర కోసం మార్చుకున్నారు. ఇందులో ఆయన పువ్వుల డిజైన్‌తో ఉన్న దుస్తులు ధరించి కనిపించారు. ఆ డిజైన్స్‌కు మంచి స్పందన లభించిందని ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌ అన్నారు. ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తుల్ని అమ్మకానికి ఉంచబోతున్నట్లు నిర్మాత ఛార్మి చెప్పారు.. ‘ఇస్పెషల్‌’ పేరుతో దుస్తుల్ని అమ్మకానికి ఉంచబోతున్నాం. www.beismart.in వెబ్‌సైట్‌లో మీ పేరును నమోదు చేసుకోండి. వీరిలోని కొందరు అదృష్టవంతులకు చిత్ర బృందం నుంచి ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌ అందుతుంది’ అని ఛార్మి అన్నారు.