పవన్ తో సినిమా చేస్తాడా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను బండ్ల గణేష్ దైవంతో సమానంగా భావిస్తుంటాడు. అతడి ఇంట్లో పూజ గదిలో పవన్ పెట్టుకొని కొలుస్తుంటానని గతంలో కూడా ఓ సారి చెప్పారు. గతంలో వీరి కాంబినేషన్ లో ‘తీన్ మార్’,’గబ్బర్ సింగ్’ వంటి సినిమాలు వచ్చాయి. తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయిందని
పవన్ పిలిచి తనకు అవకాశం ఇచ్చారని ‘గబ్బర్ సింగ్’ సినిమా అవకాశం ఇచ్చారని బండ్ల గణేష్ ఓ ఫంక్షన్ లో ఎమోషనల్ అయ్యాడు. ‘టెంపర్’ సినిమా తరువాత బండ్ల గణేష్ ఓ రీమేక్ సినిమా చేయాలనుకున్నాడు.

అది కాస్త మరుగున పడింది. అప్పటినుండి ఈ నిర్మాత ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు. సడెన్ గా పవన్ కల్యాణ్ ఆఫీస్ లో దర్శనమిచ్చాడు. దీంతో బండ్ల గణేష్ కు పవన్ మరోసారి సినిమా చేసే అవకాశం ఇచ్చాడని అని ఫిల్మ్ నగర్ గానం. ప్రస్తుతం అయితే పవన్ వరుస సినిమాలతో బిజీ ఈ నేపధ్యంలో బండ్ల గణేష్ కు అవకాశం ఇస్తాడా..? ఇండస్ట్రీ లో ఎప్పుడేం జరుగుతుందో.. ఎవరు చెప్పలేరు. పవన్ ఛాన్స్ ఇచ్చినా… ఇవ్వొచ్చు!