
Trivikram Venkatesh Movie Update:
గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయే సినిమా ఎవరి తో ఉంటుందా అని అందరూ ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. మొదట అల్లు అర్జున్‌తో ప్లాన్ చేసినా, అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్‌లో చేయబోయే సినిమాకి ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ ఓ క్విక్ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఏంటంటే, త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేశ్‌తో చేయబోతున్నాడట. ఇదే కాంబినేషన్‌పై చాలా కాలంగా ఓ సినిమా తీయాలని ప్లాన్ ఉన్నా, ఎందుకో అది ఎప్పటికీ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా డిలే కావడంతో త్రివిక్రమ్ వెంకీకి కథ చెబుతూ, రెడీ అయ్యాడట.
ఇదే కాకుండా హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికరమైన రూమర్లు వినిపిస్తున్నాయి. యంగ్ బ్యూటీ రుక్మిణి వసంతను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఆమె ఇప్పటికే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో నటించబోతుందనే టాక్ ఉంది. అంతేకాదు, ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్” చిత్రానికి దీపికా పదుకొణే తప్పుకోవడంతో, ఆ ఛాన్స్ రుక్మిణికే దక్కుతుందన్న గాసిప్స్ కూడా ఉన్నాయి.
ఇలాంటి క్రేజీ అప్డేట్స్‌తో త్రివిక్రమ్ – వెంకటేశ్ సినిమా మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి. Haarika & Hassine క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక రుక్మిణి ఫైనల్ అవుతుందా? లేదా అన్నది చూడాలి!