జబర్దస్త్‌ నుంచి హీరో కాబోతున్న మరో కమెడియన్!

క‌మెడియ‌న్స్‌కు ఈటీవీలోని జబర్దస్త్‌ షో మంచి లైఫ్‌ ఇచ్చిందని చెప్పాలి. ఈ షో నుంచి ఇప్పటికే సినిమాల్లో ఎన్నో అవకాశాలు దక్కించుకున్న నటులున్నారు. ఇదే స్టేజ్‌ నుంచి తాజాగా మరో కమెడియన్ చమ్మక్ చంద్ర హీరో కాబోతున్నాడు. ఇప్పటికే జబర్దస్త్‌ నుంచి కామెడీ హీరోగా షకలక శంకర్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మిగతా నటులు సైతం పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. పేరుకు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్ అయినా సినిమా వాళ్ల‌కు ఎంత క్రేజ్ ఉందో అంత‌కంటే ఎక్కువే వీళ్లకు ఉంది. సినిమాల్లో వీళ్ల‌కు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చిన్న సినిమాల్లో కేవ‌లం అక్క‌డ‌క్క‌డా కమెడియన్‌గా మాత్రమే క‌నిపించాడు. అప్పుడ‌ప్పుడూ అర‌వింద స‌మేత లాంటి సినిమాల్లో కూడా అవ‌కాశాలు అందుకున్నాడు.

ఇప్పుడు చమ్మక్ చంద్ర ఏకంగా హీరో అవుతున్నాడు. ‘రామ‌స‌క్క‌నోళ్లు’ అనే సినిమాతో హీరోగా మారిపోతున్నాడు. స‌తీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కార్తికేన్ తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. పూర్తిగా గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై న‌వ్వులు పూయించిన చ‌మ్మ‌క్ చంద్ర ఇప్పుడు వెండితెర‌పై హీరోగా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.