HomeTelugu Trendingపెద్ద.. చిన్న ఎన్టీఆర్‌ దంపతుల ఫొటో షేర్‌ చేసిన బండ్ల గణేశ్.. ఆసక్తికర వ్యాఖ్యలు

పెద్ద.. చిన్న ఎన్టీఆర్‌ దంపతుల ఫొటో షేర్‌ చేసిన బండ్ల గణేశ్.. ఆసక్తికర వ్యాఖ్యలు

4 12

నిర్మాత బండ్ల గణేశ్.. రాజకీయాలకు గుడ్‌ బై చెప్పి మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. మొన్న పవన్‌ కల్యాణ్ పై ట్వీట్‌ చేశాడు. తాజగా జూనియర్‌ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అప్పుడు పెద్ద రామయ్య పుణ్య దంపతులు.. ఇప్పుడు చిన్న రామయ్య దంపతులు’ అంటూ ఆ ఇద్దరు దంపతుల ఫొటోలను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌తో మళ్లీ ఓ సినిమా తీయాలని ఆయనను అభిమానులు కోరుతున్నారు.

‘బండ్ల గణేశ్ అన్న మాకు 2 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చావ్… జై ఎన్టీఆర్’ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన బండ్ల గణేశ్.. ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మా బ్యానర్ కు అవకాశం ఇచ్చారు అది నా అదృష్టం’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu