HomeTelugu Trendingబండ్ల గణేష్‌ కొడుకు హీరోగా..!

బండ్ల గణేష్‌ కొడుకు హీరోగా..!

Untitled 1 1
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల కరోనా బారినపడి కోలుకుని బయటపడటం తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ సినిమా నిర్మించి నష్టపోయిన గణేష్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో పండగ చేసుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలతో, ఎన్టీఆర్‌తో బాద్షా, టెంపర్ సినిమాలు నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఆ తర్వాత ఆషీకీ-2ని తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో రీమేక్ చేసి ప్లాప్ అందుకున్నాడు. దాని తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన బండ్ల గణేష్ అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయాడు. తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చాడు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలోనటించారు. ఇటీవల సోషల్ మీడియాలో గణేష్ స్టేట్ మెంట్ హాట్ టాపిక్ అయ్యింది . “ఇకపై చిన్న పాత్రలు చేయనని, మంచి ఎమోషనల్ పాత్ర చేయాలనీ ఉందని అంటున్నాడు. అంతే కాకుండా భవిష్యత్తులో తన కొడుకును తెరంగేట్రం చేయించాలని ఉందని మనసులో మాట బయట పెట్టాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu