HomeTelugu Trendingటీవీ9 రవిప్రకాష్‌ అరెస్ట్‌

టీవీ9 రవిప్రకాష్‌ అరెస్ట్‌

8 5

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీసులు. గతంలో టీవీ9 స్టూడియోకు వచ్చిన సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు. రవిప్రకాష్‌ ఇంటికి వెళ్లిన 10 మంది పోలీసులు బృందం… ఆయనను అరెస్ట్ చేసి పీఎస్‌కు తీసుకెళ్లింది. రవి ప్రకాష్ పై గతంలో అనేక కేసులు ఉన్నాయి.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. టీవీ 9 ఫోర్జరీ కేసు, లోగోలు అమ్ముకున్న కేసు, అక్రమ సంపాదనలపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టు కాకుండా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పాత కేసులు అలా ఉండగానే మరో ఫిర్యాదు అందింది.. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఇప్పటికే రవిప్రకాష్‌పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. నిధుల గోల్మాల్ సంబంధించి ఒక కేసు నమోదు కాగా టీవీ9 లోగోను అనధికారికంగా అమ్మారనే ఆరోపణలపై మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసులు సంబంధించి అతని పైన ఇప్పటికే 41 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చారు. ఈ రెండింటిలో కూడా గతంలోనే అధికారులు విచారించారు. ఇక, ఏబీసీఎల్‌ కంపెనీకి చెందిన రూ. 18 కోట్ల డబ్బుని వ్యక్తిగతానికి వాడుకున్నారని.. మాజీ సీఈవో రవిప్రకాష్, మూర్తి.. కంపెనీ నిధుల్ని ఇతర డైరెక్టర్లకి చెప్పకుండా విత్ డ్రా చేసినట్టు నిర్ధారించారు. దీంతో రవిప్రకాష్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!