
Upcoming Pan-Indian Movies in Telugu: బాహుబలి పుణ్యమా అని టాలీవుడ్ లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాల ట్రెండ్ బాగా మొదలైపోయింది. అయితే బాహుబలి నుంచి డైరెక్టర్లు మరొక ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నారు. అదే సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయడం.
బాహుబలి సినిమాని రాజమౌళి.. రెండు భాగాలుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటి భాగం కంటే రెండవ భాగం.. బాక్సాఫీస్ వద్ద ఇంకా బాగా కలెక్షన్లు అందుకుంది. అదే దారిలో కన్నడలో కేజిఎఫ్ సినిమా కూడా.. రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించింది. తమిళ్లో కూడా మణిరత్నం.. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ఈ ట్రెండ్ ఫాలో అయ్యారు.
ఆ తర్వాత మళ్లీ పుష్ప సినిమాకి కూడా రెండు భాగాలుగా విడుదల ప్లాన్ చేశారు. 2021 లో విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ఆగస్టులో విడుదల కావాల్సింది.. కానీ డిసెంబర్ కి వాయిదా పడింది.
అయితే సినిమాలని రెండు భాగాలుగా తీయడం వల్ల అభిమానులకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మెయిన్ ప్రాబ్లం అంటే రెండవ భాగం చేయడానికి.. దర్శక నిర్మాతలు తీసుకుంటున్న సమయం వల్ల అసలు ప్రాబ్లం వస్తుంది.
సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. దాని రెండవ భాగం పూర్తి చేయడానికి దర్శక నిర్మాతలు.. సంవత్సరాలు సంవత్సరాలు సమయం తీసుకుంటున్నారు. బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 పూర్తి చేయడానికి రాజమౌళి 658 రోజులు తీసుకున్నారు. కేజిఎఫ్ కోసం కూడా ప్రశాంత్ నీల్ 1210 రోజులు కేటాయించారు.
మణిరత్నం ఈ విషయంలో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కేవలం 210 రోజుల్లోనే సినిమాని పూర్తి చేశారు. ఇక సుకుమార్ కూడా పుష్ప 2 సినిమా కోసం.. 1085 రోజులు స్పెండ్ చేయనున్నారు. తెలుగులో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సీక్వెల్ గా.. పుష్ప: ది రూల్ చరిత్ర సృష్టిస్తుంది.
ఇక మరోవైపు సలార్ సినిమాకి కూడా రెండవ భాగం విడుదల కాబోతోంది. దేవర, కల్కి 2898 సినిమాలు కూడా రెండు భాగాలు గానే విడుదల కి సిద్ధమవుతున్నాయి. ఏదేమైనా ప్యాన్ ఇండియా సినిమా అంటూ.. రెండు భాగాలు అంటూ.. స్టార్ హీరోలు సంవత్సరాలు సంవత్సరాలు ఒక సినిమా కే కేటాయిస్తున్నారు. తమ అభిమాన హీరోలను వెండి తెర మీద చూడడానికి.. అభిమానులు కూడా సంవత్సరాలు తరబడి ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. దీంతో సినిమా సీక్వెల్ అంటేనే అభిమానులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.