HomeTelugu Trendingరామ్‌ చరణ్‌ చేతులు మీదుగా ‘అనుభవించు రాజా’ టీజర్‌

రామ్‌ చరణ్‌ చేతులు మీదుగా ‘అనుభవించు రాజా’ టీజర్‌

Ram charan release anubhavi
టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కషీప్‌ఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ని వదలింది చిత్రం బృందం. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా ఈ టీజర్‌ విడుదలైంది.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇదని టీజర్‌ చూస్తే అర్థమవుతంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా, ఫన్ పండించే డైలాగ్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ‘బంగారం గాడు ఊర్లో, వాడి పుంజు బరిలో ఉండగా ఇంకోకడు గెలవడం కష్టమే’అంటూ రాజ్‌ తరుణ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్‌ నరేన్, అజయ్ సుదర్శన్, టెంపర్‌ వంశీ, ఆదర్శ్‌ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్‌ రాజు, అరియానా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu