మహేష్ బాబు అక్క మంజుల వెబ్‌ సిరీస్‌తో..!

సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసురాలిగా వెండితెర మీద సత్తా చాటుతున్న నటి, నిర్మాత, దర్శకురాలు మంజుల. అభిమానుల ఆంక్షల మధ్య వెండితెరకు పరిచయం అయిన మంజుల తొలి సినిమా షోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత అడపాదడపా నటిగా కొనసాగుతూనే నిర్మాతగానూ ఇందిరా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై పలు చిత్రాలను ప్రొడ్యూస్‌ చేశారు.

ఇటీవల సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలిగా మారిన మంజుల త్వరలో మరో రంగంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న డిజిటల్‌ ట్రెండ్‌కు అనుగుణంగా అ! ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం…ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మించనున్నారు మంజుల. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చురుగ్గా జరుగుతుందట. ఈ ఏడాది చివరి వరకు ఈ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తున్నది.