రమేష్ వర్మతో బెల్లంకొండ సినిమా!

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి బెల్లంకొండ శ్రీనివాస్ మంచి హిట్‌ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు 5 సినిమాలు చేశారు. ప్రతి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిందే. కానీ, అనుకున్నంతగా సినిమాలు సక్సెస్ కాలేక పోతున్నాయి. ప్రస్తుతం ఈ హీరో తేజాతో ‘సీత’ సినిమా చేస్తున్నాడు.

రానాతో నేనేరాజు నేనే మంత్రి తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్. ఈ సినిమాతో పాటు దర్శకుడు రమేష్ వర్మతో సినిమా చేసేందుకు సిద్ధమైయ్యాడు. పబ్లిసిటీ డిజైనర్ నుంచి దర్శకుడిగా మారిన రమేష్ వర్మ.. గతంలో చాలా సినిమాలు చేశాడు. చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో సైకో థ్రిల్లర్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. ఇది పెద్ద సాహసమనే చెప్పాలి. కాగా ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.

ఈ సినిమాతో పాటు స్టువర్ట్ పురం దొంగ టైగర్ ప్రసాద్ బయోపిక్ లో నటించేందుకు ఈ హీరో సిద్ధం అవుతున్నాడు. వరస సినిమాలు చేస్తున్నా.. బ్రేక్ ఇచ్చే హిట్ మాత్రం దక్కడంలేదు ఈ హీరోకి. మరి ఈ మూడు సినిమాలతోనైనా హిట్ కొడతాడా చూద్దాం.