వర్మ పోస్ట్ ని చెత్త అంటోన్న ఆయన కూతురు!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఆయన కూతురు రేవతి విరుచుకుపడింది. నువ్ మారవు నాన్నా..? నీ మెంటాలిటీ ఇంతే అంటూ శత్రువు కంటే ఘోరంగా తిట్టేసింది. అసలు విషయంలోకి వస్తే.. పవన్ తన చిన్న కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరును పెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వర్మ కాస్త వెటకారంగా పోస్ట్ చేస్తూ చరిత్ర మొత్తం వెతికినా.. ఇలాంటి పేరు దొరకలేదూ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

ఈ పోస్ట్ వర్మ కూతురు రేవతికి కోపం తెప్పించింది. పవన్ కల్యాణ్ కుమారుడి పేరు గురించి నీవు పెట్టిన చెత్త పోస్ట్ లో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.. చరిత్రకు సంబంధించిన సంబంధం లేని విషయాలతో పోలుస్తూ జీరో సెన్స్ తో.. నీవు చాలా కాంప్లికేటెడ్ పదాలు వాడావు..” అంటూ రేవతి మండిపడింది.

కూతురికి సమాధానం ఇస్తూ.. ‘నీవు చేసిన పోస్ట్ పవన్ కల్యాణ్ లో దాగి ఉన్న తాత్విక విలువల్ని అర్ధం చేసుకునే విషయంలో నీకున్న అవగాహనా శక్తిని తెలియజేస్తుంది. అసలు నిజం ఏంటంటే నీకంటే ఎక్కువగా నేను అతన్ని ఇష్టపడతాను. నా అంతగా నువ్వు తనను ఇష్టపడలేవు’ అంటూ పోస్ట్ చేశారు.