HomeTelugu Trendingబెల్లంకొండ శ్రీను రాక్షసుడు సీక్వెల్

బెల్లంకొండ శ్రీను రాక్షసుడు సీక్వెల్

Bellamkonda Srinu Rakshasud

రాక్షసుడు సినిమాతో విజయాన్ని అందుకున్న బెల్లంకొండ శ్రీను ఇప్పుడు దానికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. దర్శకుడు రమేష్ వర్మ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. రాక్షసుడు నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాది జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు. ఆరేళ్ల క్రితం అల్లుడు శీను సినిమాతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తనకు ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. మొదటి సినిమా విజయం సాధించినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త నిరాశపడ్డాడు. జయజానకీనాయక మినహా ఆ తరువాత వచ్చిన సినిమాలు కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో బెల్లంకొండ శ్రీను న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!