HomeTelugu Newsసీఎం అంటు నినాదాలు.. ఎన్టీఆర్‌ రియక్షన్‌

సీఎం అంటు నినాదాలు.. ఎన్టీఆర్‌ రియక్షన్‌

Ntr reaction On his Fans co
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆరాధిస్తారు. తాతగారు ముందుకు నడిపించిన తెలుగు దేశం పార్టీ పగ్గాలు ఏ నాటికైనా జూ.ఎన్టీఆర్ చేపడతారనేది అభిమానుల భావన. అందుకే తారక్ ఎక్కడ కనిపించినా సీఎం సీఎం అనే నినాదాలు మిన్నంటుతాయి. తాజాగా ఎం.ఎం.కీరవాణి వారసుడు.. శ్రీసింహా నటించిన తెల్లవారితే గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తారక్ ప్రసంగిస్తుండగా.. అనూహ్యంగా అభిమానుల్లో సీఎం సీఎం అంటూ నినాదాలు మిన్నంటాయి. అభిమానుల వల్ల తారక్ స్పీచ్ కి ఇబ్బంది తలెత్తింది. దయచేసి ఆపండి బ్రదర్.. అంటూ తారక్ వారించాడు.

అయితే అభిమానుల పిలుపు మేరకు అతడు మునుముందు రాజకీయాల్లోకి వస్తారా? అంటే అందుకు అవకాశం కనిపించడం లేదు. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మీరు తిరిగి రాజకీయాల్లోకి వచ్చేదెపుడు? అన్న ప్రశ్నకు మీకు తెలుసు కదా బ్రదర్ అంటూ సమాధానం దాటవేశారు. తారక్ తెలుగు దేశం పార్టీకి సపోర్టర్ గా మాత్రమే ఉన్నారు. ఇంతకుముందు పార్టీకి ప్రచారం చేశారు. ప్రస్తుతానికి కేవలం సినిమాలపైనే తన దృష్టి పెట్టాడు. యంగ్ టైగర్ రాజకీయాలపై అనాసక్తిగా ఉన్నారని అర్థమవుతూనే ఉంది. కానీ అభిమానులు మాత్రం ఎప్పటికైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీ పగ్గాలు చేపట్టి సీఎం అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!