బాలయ్య సినిమాలో క్యాలండర్ గర్ల్!

బాలకృష్ణ 101వ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతోంది. దాదాపు నలభై రోజుల పాటు చిత్రీకరణ అక్కడే జరగనుంది. పాటలను, యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ జంటగా కనిపించనుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఆరంభంలోనే ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేశాడు దర్శకుడు పూరిజగన్నాథ్. ఈ ఐటెమ్ సాంగ్ సినిమాకు చాలా స్పెషల్ అని తెలుస్తోంది. ఈ పాట ఎవరితో చేయించాలనే ఆలోచనల్లో మొదట ఛార్మీ పేరు వినిపించింది.

కానీ ఇప్పుడు కొత్త అమ్మాయి అయితే బావుంటుందని బాలకృష్ణ అభిప్రాయ పడడంతో పూరి కొంతమంది పేర్లను పరిశీలించి ‘కైరాదత్’ను రంగంలోకి దింపాడు. మధూర్ బండార్కర్ తెరకెక్కించిన ‘క్యాలండర్ గర్ల్స్’ అనే సినిమాతో కైరా దత్ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. బాలకృష్ణ సినిమాలో ఐటెమ్ సాంగ్ విషయమై కైరాను సంప్రదించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు
తెలుస్తోంది. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన చిత్రీకరణ మొదలుపెడతారని సమాచారం.