HomeTelugu Big Storiesమెహరీన్‌తో నిశ్చితార్థాం రద్దుపై భవ్య కామెంట్స్‌

మెహరీన్‌తో నిశ్చితార్థాం రద్దుపై భవ్య కామెంట్స్‌

Bhavya bishnoi comments on
టాలీవుడ్‌ బ్యూటీ మెహరీన్‌ పిర్జాదా నిశ్చితార్థవ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి షాక్‌కు గురిచేశారు. ఇకపై భవ్య, వాళ్ల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కరోనా కారణంగా పెళ్లిని కొంతకాలం వాయిదా వేస్తున్నామని అప్పట్లో మెహరీన్‌ వెల్లడించారు.

కాగా.. నిశ్చితార్థం రద్దు కావడంపై నెటిజన్ల నుంచి పలు కామెంట్లు వస్తున్నాయి. మెహరీన్‌కి‌.. బిష్ణోయ్‌, అతని కుటుంబం సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో వస్తోన్న పోస్టులపై భవ్య స్పందించారు. ‘మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని జులై 1నే మేమిద్దరం నిర్ణయం తీసుకున్నాం. మెహ్రీన్‌ పరిచయమైన నాటి నుంచి ఆమెను ఎంతో ప్రేమించాను. ఆమె కుటుంబాన్ని కూడా గౌరవించాను. మా ఇద్దరిది మంచి జోడీ అవుతుందని భావించాను. కానీ కాలం మా జీవితాలను వేరేలా చేసింది. మెహ్రీన్‌ నుంచి విడిపోతున్నందుకు నేను బాధపడడం లేదు.

నిశ్చితార్థం రద్దు విషయంలో నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఎవరైనా కామెంట్లు చేస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటాను. నాకు, నా కుటుంబానికి సమాజంలో మంచి గౌరవం ఉంది. మెహ్రీన్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నాను. ఆమెతోపాటు ఆమె కుటుంబాన్ని, స్నేహితుల్ని ఎప్పుడూ ఉన్నతంగానే చూశాను. మా ప్రేమానురాగాలను జీవితాంతం నెమరువేసుకుంటాను’ అని భవ్య బిష్ణోయ్‌ పోస్ట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!