HomeTelugu Big Storiesసంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయ‌క్'

సంక్రాంతి బరిలోనే ‘భీమ్లా నాయ‌క్’

bheemla nayak on 12th jan
పవర్‌ స్టార్‌ ప‌వన్ క‌ళ్యాణ్‌-రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్’. సాగ‌ర్ కె చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ప‌వ‌న్‌కి జంటగా నిత్యా మీనన్, రానాకి జంట‌గా సంయుక్త మీనన్ న‌టిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మూవీని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కాని స‌డెన్‌గా ఆర్ఆర్ఆర్ జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంద‌ని ప్ర‌క‌టించడంతో మ‌హేష్ బాబు లాంటి హీరో వెన‌క్కు త‌గ్గాడు. ఏప్రిల్ లో సర్కారు వారి పాట విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు పేర్కొన్నాడు.

దీంతో ప‌వ‌న్ సినిమా కూడా వాయిదా ప‌డుతుంద‌ని అంద‌రు అనుకున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా విడుదల అవుతుందంటూ ప్ర‌చారం జ‌రిగింది. కాని తాజాగా జ‌న‌వ‌రి 12న చిత్రం విడుద‌ల కానుందంటూ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. దీంతో సంక్రాంతి బ‌రిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయ‌క్, రాధే శ్యామ్ మధ్య గ‌ట్టి పోటి ఉండ‌డం ఖాయం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!