HomeTelugu Trendingనెట్ ఫ్లిక్స్ లో 'భోళాశంకర్' ఎప్పుడంటే!

నెట్ ఫ్లిక్స్ లో ‘భోళాశంకర్’ ఎప్పుడంటే!

bhola shankar movie update

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, మెగా అభిమానులను నిరాశపరిచింది.

వీకెండ్ తరువాత వసూళ్లు కూడా బాగా పడిపోయాయి. నిర్మాతకి భారీ నష్టం తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ సినిమాను సెప్టెంబర్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అంటున్నారు. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అంటే ‘వినాయక చవితి’ పండుగ సందర్భంగా ఈ సినిమాను వదలనున్నారని సమాచారం. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావొచ్చని భావిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేష్‌ చిరంజీవి చెల్లిగా నటించింది. సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, గెటప్ శీను కీలకపాత్రలు పోషించారు. మహతీ స్వరసాగర్ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!