HomeTelugu Trendingబిగ్‌బాస్‌: శిల్పా చక్రవర్తి ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌: శిల్పా చక్రవర్తి ఎలిమినేటెడ్‌!

5 11బిగ్‌బాస్‌-3లో ఎలిమినేషన్‌ ప్రకియ అనేది ఎంత ఉత్కంఠగా సాగాల్సి ఉంటుందో.. అందుకు భిన్నంగా జరుగుతూ వస్తోంది. మొదటి వారం నుంచి ఎలిమినేట్‌ కాబోయే కంటెస్టెంట్‌ ఎవరన్నది బిగ్‌బాస్‌ కంటే ముందుగానే షోను చూసే ప్రేక్షకులకు తెలిసిపోతోంది. అయితే అవి ఊహాగానాల వరకు అయితే పర్లేదు కానీ.. అనధికారికంగా వచ్చే అధికార వార్త అవుతోంది. ఎలిమినేషన్‌ కాబోతున్నది వీరే అంటూ శనివారమే లీకవుతోంది.

అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిదో వారంలో ఎలిమినేషన్‌కు గురయ్యే కంటెస్టెంట్‌ ఎవరన్నది ముందే తెలిసిపోయింది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి.. ఈ వారం బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చిన వారంలో తనను నామినేట్‌ చేసేందుకు వీలుండదు.. కాబట్టి రెండో వారంలో అందరూ ఒకే కారణంతో ఆమెను నామినేట్‌ చేసేశారు. దీంతో శిల్పా నిష్క్రమణ తప్పలేదనిపిస్తోంది. అయితే ఎలిమినేట్‌ అయిన విషయం అధికారికంగా తెలియాలంటే ఆదివారం నాడు షో ప్రసారమయ్యే వరకు ఆగాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!