HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌ హైలైట్స్‌.. రొమాన్స్‌ చేసిన వరుణ్‌, వితికా

బిగ్‌బాస్‌ హైలైట్స్‌.. రొమాన్స్‌ చేసిన వరుణ్‌, వితికా

14 11

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి నాగార్జున హోస్ట్ కావడం, 15 మంది కలర్ ఫుల్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫుల్ జోష్‌‌తో ఈ రియాలిటీ షో నడుస్తోంది. ఇక ఈ మూడు రోజుల్లో బిగ్‌బాస్ హౌస్‌లోని 15 మంది కంటెస్టెంట్స్‌లో ఆరుగురు ఎలిమినేషన్‌‌లోకి వెళ్లడం.. హిమజ, హేమల మధ్య వార్ మొదలు కావడం.. బాబా భాస్కర్ కామెడీ పండిస్తుండటం ఇప్పటి వరకూ ఉన్న హైలైట్స్.. ఇక నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే..

ప్రస్తుతం ఎలిమినేషన్‌లో ఉన్న హేమ కిచెన్‌లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. టీలో షుగర్ తక్కువైందని.. నీళ్లలా ఉందంటూ కంప్లయింట్స్ రావడంతో సీరియస్ అయ్యింది హేమ. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్, వితికాలు బెడ్ రూంలో రొమాంటిక్‌గా మాట్లాడుకున్నారు. నన్ను హౌస్ నుండి పంపేందుకు అందరూ ప్లాన్‌లు చేస్తున్నారని వరుణ్‌తో చెప్పింది వితిక షెరు. ఇక.. అవును నువ్వు నాకు ఐ లవ్ యు చెప్పి ఎన్ని రోజులైంది. ఈరోజు చెప్పావా అని వితికా అడగడంతో చెప్పాగా.. అని వరుణ్ చెప్పారు. నువ్వు నన్ను ఎత్తుకున్నావా? నాగార్జున చెబితే ఎత్తుకున్నావు. ఇప్పుడు ఎత్తుకోవడం లేదని నాగార్జున గారికి కంప్లయింట్ చేస్తానని రొమాంటిక్‌గా మాట్లాడింది వితికా.

నేటి టాస్క్‌లో భాగంగా.. బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ చిన్న పిల్లలుగా టీచర్లుగా వ్యవహరించాలని కామెడీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక 15 మంది కంటెస్టెంట్స్‌లో ఒక్క మహేష్ విట్టా తప్ప మిగిలిన 14 మంది వాళ్ల పెర్ఫార్మెన్స్ చూపించారు. ముఖాల నిండా రంగులు పూసుకుని చిన్న పిల్లలుగా రచ్చ రచ్చ చేశారు. వీరందరికీ టీచర్‌గా పునర్నవి ఉండగా.. శ్రీముఖి సహా రోహిణి, రవికృష్ణ రెచ్చిపోయి నటించారు. అయితే తన చిన్నప్పటి నుండి ఎగిరి గంతులేసింది లేదని.. సైలెంట్‌గా ఉంటానని ఇప్పుడు కూడా ఇలాగే ఉంటానని ఇలా ఓవర్ యాక్షన్ చేయడం నాకు చేతకాదు అంటూ సైలెంట్‌గా ఉండిపోయారు మహేష్ విట్టా.

అయితే రవికృష్ణ, రోహిణిలు ఓవరాక్షన్ చేస్తూ.. పడుకుని ఉన్న మహేష్‌ని ఉద్దేశించి ఆ కర్రిగాడు ఊడపొడుస్తా అన్నాడు ఇప్పుడు పడుకున్నాడు.. గేమ్ ఆడటం లేదు అంటూ అతను బాధపడేలా మాట్లాడటంతో మహేష్ విట్టా సీరియస్ అయ్యాడు. ‘నువ్వు అసలు చదువుకున్నావా? మహేష్ గాడు అని అను పర్లేదు.. అంతే కాని కర్రోడు అంటూ కించపరిచేలా మాట్లాడితే బాగోదు’ అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రవికృష్ణ.. మహేష్ విట్టాకు సారీ చెప్పాడు. ఇక టాస్క్‌కి టీచర్‌గా ఉన్న పునర్నవీ భూపాలం.. మహేష్‌ని కన్విన్స్ చేసి.. నీకు నచ్చినట్టుగా గేమ్ ఆడు అంటూ సర్ధిచెప్పింది. ఆ తర్వాత కిచెన్‌లో గొడవ ప్రారంభమైంది.. ఫుడ్‌ విషయంలో సింగర్‌ రాహుల్‌, రవికృష్ణ.. హేమతో వాగ్వాదానికి దిగారు.. చాలా సేపు సైలెంట్‌గా ఉన్న హేమ సడన్‌గా రెచ్చిపోయింది.. వారిపై మండిపడింది.. అంతే బిగ్‌బాస్‌-3లో ఈ ఎపిసోడ్‌ ఇక్కడితో ముగిసింది.. రేపటి ఎపిసోడ్‌ చూద్దాం అన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu