HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-3 తెలుగు 14వ ఎపిసోడ్ హైలైట్స్

బిగ్‌బాస్‌-3 తెలుగు 14వ ఎపిసోడ్ హైలైట్స్

11
బిగ్‌బాస్ సీజన్-3 తెలుగు 13 ఎపిసోడ్‌‌లను ముగించుకుని నేడు (ఆగస్ట్ 3) పద్నాలుగో ఎపిసోడ్‌ ప్రసారమైంది. 8 మంది ఎలిమినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీకెండ్ నాగార్జున ఎంట్రీ ఉండటంతో ఫుల్ జోష్‌‌తో ఆట ప్రారంభమైంది. గ్రీకువీరుడు.. నా రాకుమారుడు అనే నాగార్జున ఎవర్‌గ్రీన్ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. నాలుగున్నర కోట్ల మంది మా బిగ్ బాస్ షోను ఆదరిస్తున్నారు.. ఇది చరిత్ర. మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుతూ హౌస్‌లో ఏం జరుగుతుందో మన టీవీ ద్వారా చూపించారు నాగార్జున.

హౌస్‌లో కిచెన్‌లో పునర్నవిని కాకాపట్టే పనిలో పడ్డ రాహుల్ కప్పులు కడుగుతూ కలరింగ్ ఇచ్చారు. ఇక తమన్నా.. రవిక్రిష్ణ ఫేస్ క్రీమ్‌ని దాచేసి ఆటపట్టించింది. మరోవైపు ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న దానిపై వరుణ్ సందేశ్ అండ్ బ్యాచ్ సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. వితికా,వరుణ్‌లు ఈసారి భాస్కర్ నామినేట్ అయ్యే అవకాశం ఉందని అంటూ.. పునర్నవిని అడగ్గా నాకు కూడా జె ఫర్ జామకాయ ఎలిమినేట్ అవుతాడని ఇన్ డైరెక్ట్‌గా జాఫర్‌ ఎలిమినేట్ అవుతాడని చెప్పకనే చెప్పింది పునర్నవి.

ఇక హౌస్‌లో రొమాంటిక్ జంటగా ఎంట్రీ ఇచ్చిన రియల్ లైఫ్ కపుల్స్ వరుణ్, వితికా‌లు బెడ్‌పై ముచ్చట్లు పెట్టారు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో వితికా కాస్త అడ్వాన్స్ అవుతూ భర్తను కౌగిలించుకునే ప్రయత్నం చేసింది. వరుణ్ దుప్పటిలో దూరి నీ హార్ట్ బీట్ వింటా అని అతని గుండెలపై తల పెట్టుకుని పడుకుంది. ఏంటి అలా మీద పడిపోతావ్.. ఓవర్ యాక్షన్ చేయకు అంటూ సర్దిచెప్తూ రొమాన్స్ పండించారు. ఇక వీళ్ల రొమాన్స్‌ను బయటనుండి చూస్తున్న జాఫర్, శ్రీముఖిలు సెటైర్లు వేసుకున్నారు. ఇక షో చూస్తున్న ప్రేక్షకులకు సైతం వితికా చాలా రొమాంటిక్ గురూ అనిపించేలా ప్రవర్తించింది.

మొదటివారం చాలా సరదాగా మాట్లాడినా ఈ వారం హౌస్‌మేట్స్‌కి చురకలు పెట్టే ప్రయత్నం చేశారు నాగార్జున. మంచి ప్రవర్తనతో ఉన్న వాళ్లను ప్రశంసించారు. ఈవారం మందలించడానికి ట్రై చేస్తా.. లేదంటే వాతలు పెడతా అంటూ ఒక్కో కంటెస్టెంట్ 2 వారాల్లో హౌస్‌లో ఎలా ప్రవర్తించారో గుర్తు చేశారు. ముఖ్యంగా హౌస్ మేట్స్, అలీతో తమన్నా ప్రవర్తించిన తీరుపై వివరణ అడిగారు. తమన్నా తనతో గొడవ పడుతున్న సందర్భంలో అలీ చాలా మెచ్యుర్డ్‌గా వ్యవహరించారని.. చిన్న వయసులో ఇంత ఓపిక ఉండటం గ్రేట్ అన్నారు. ఇక శివజ్యోతి ఏడవడం, మహేష్‌తో వరుణ్ గొడవ గురించి వివరణ అడిగారు.

ఇక ప్రతి వారం లాగే ఈవారం కూడా హౌస్‌మేట్స్‌కు ఓ సరదా టాస్క్ ఇచ్చారు. రెండు కిరీటాలు ఇచ్చి ఒకటి గోల్డ్, మరోటి బ్లాక్.. హౌస్‌లో మీరు హీరో అనుకునే వారికి గోల్డ్‌ కిరీటం, విలన్‌ అనుకునే వారికి బ్లాక్ కిరీటం పెట్టాలని అంతేకాదు ఎందుకు అలా అనుకుంటున్నారో కూడా వివరణ ఇవ్వాలని అన్నారు. హౌస్‌మేట్స్‌ మొత్తం బాబా భాస్కర్‌ను హీరోగా చెప్పేశారు. అతనికి వరుసగా మూడు కిరీటాలు పెట్టారు. బాబా భాస్కర్ వరుసగా మూడు కిరీటాలతో హ్యాట్రిక్ కొట్టడంతో అతను కాకుండా వేరే వాళ్లను హీరోగా కిరీటం పెట్టాలని కోరారు నాగార్జున. విలన్లుగా మాత్రం ఎక్కువ కిరీటాలు.. తమన్నా, వరుణ్ సందేశ్‌కు వచ్చాయి. అయితే హౌస్‌‌లో ఉన్న 15 మందిలో అషు, పునర్నవి, హిమజలకు క్లీన్ చిట్ ఇస్తూ ఒక్క విలన్ కిరీటం కూడా రాలేదు.

ఈవారం ఎలిమినేషన్‌లో భాగంగా నామినేషన్‌లో ఉన్న 8 మందిలో నలుగురు సేఫ్ అయ్యారు. తొలి సేఫ్ కంటెస్టెంట్ మహేష్ విట్టా కాగా.. ఆ తరువాత హిమజ, రాహుల్‌లు ఓట్ల ద్వారా సేఫ్ అయ్యారు. నాలుగో సేఫ్ కంటెస్టెంట్‌గా శ్రీముఖి గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక 8 మందిలో మిగిలిన నలుగురు వితికా, వరుణ్, జాఫర్, పునర్నవిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది సస్పెన్స్‌గా ఉంచుతూ ఎలిమినేషన్‌ను రేపటికి వాయిదా వేశారు నాగార్జున.

Recent Articles English

Gallery

Recent Articles Telugu