HomeTelugu Big Storiesబిగ్‌బాస్ తెలుగు 18వ(ఆగస్ట్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌

బిగ్‌బాస్ తెలుగు 18వ(ఆగస్ట్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌

10 5బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 17 ఎపిసోడ్‌‌లను ముగించుకుని నేడు 18వ ఎపిసోడ్‌లోకి ఎంటరయింది. ఇప్పటికే హౌస్‌లో రచ్చ మొదలైంది. తమన్నా తన ఓవరాక్షన్‌తో హౌస్‌లో అందరికీ చుక్కలు చూపిస్తోంది. అందుకే తమన్నాను అందరూ టార్గెట్ చేశారనిపిస్తోంది. ఈవారం కెప్టెన్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ వయొలెంట్‌గా మారింది. సరదా టాస్క్ కాస్తా ఫిజికల్ టాస్క్‌గా మారడంతో గాయాలపాలయ్యారు. ముందుగా బిగ్ బాస్ ఇచ్చిన నిధిని కాపాడుకోవడంలో భాగంగా రెండు టీంలుగా విడిపోయారు. శ్రీముఖి, రవికృష్ణ, అషు రెడ్డి తదితరులు దొంగలుగా ఉండగా.. వాటిని కాపాడుకోవడం కోసం వరుణ్, రాహుల్, వితికా, తమన్నా, మహేష్ అండ్ బ్యాచ్ నిధిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్, శివజ్యోతిలు పోలీసులు కాగా, హిమజ లాయర్‌.

హౌస్‌మేట్స్ మధ్య కొట్లాట పెట్టడమే ఈ గేమ్ అసలు ఉద్దేశం అనిపిస్తోంది. బిగ్ బాస్ భావించినట్టుగానే ఈ కెప్టెన్ టాస్క్ ఫిజికల్ అటాక్‌కి దిగే వరకూ వెళ్లింది. ముందుగా హిమజ-అలీల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇంట్లో వాటర్ తాగడానికి వెళ్లిన హిమజను అలీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది. రెండోసారి మళ్లీ నీళ్లు తాగే ప్రయత్నంలో ఆమెను అడ్డుకుని ఆమె జేబులో చేయిపెట్టి డబ్బులు లాక్కుంటూ ఆమెపై ఫిజికల్ ఎటాక్ చేయబోగా.. కాపాడుకునే ప్రయత్నంలో అతని ముఖంపై తన్నేసింది హిమజ. నీకు డబ్బులు కావాలంటే ఇస్తా కాని.. నువ్ టచ్ చేయకు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అలీ కోపంతో ఊగిపోయాడు. నువ్ నా ముఖం మీద తన్నుతావా? నిన్నూ లాగిపెట్టి కొడతా అంటూ హిమజపైకి దూసుకెళ్లాడు.

అయితే నువ్ చేతులు పెట్టావ్ కాబట్టే నిన్ను తన్నాను. వ్యక్తిగతంగా చేయాలని కాదు అంటూ సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది హిమజ. అయితే అలీ నువ్ వాటర్ తాగి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే నేను డబ్బులు తీసుకోవడానికి ట్రై చేశా.. అంత మాత్రాన తన్నుతావా అని గట్టిగా అరవడంతో పాటు ఆమెపై వ్యక్తిగత దూషణకు దిగాడు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటంతో హిమజ హర్ట్ అయ్యింది. నేను కావాలని తన్నలేదు.. అయినా తప్పు జరిగింది కాబట్టి క్షమించు అంటూ సారీ చెప్పింది. అయినప్పటి అలీ తగ్గకపోవడంతో సారి చెప్తున్నా కదా.. ఇంకేం చేయాలి అంటూ అతని కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. నువ్వు కాళ్లపై పడి సింపథీ చూపించడం కాదు.. నేను నిన్ను కాళ్లపై పడమన్నానా? అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో హిమజ.. బాత్రూమ్‌కి వెళ్లి మరీ బోరున ఏడ్చింది.

ఇక మధ్యలో తమన్నా కల్పించుకుని ఆమె క్షమాపణ చెప్తూ కాళ్లపై పడినా ఎందుకు రెచ్చిపోతున్నావ్ అంటూ తనదైన శైలిలో అలీపై అటాక్‌కి దిగింది. అయితే అలీ కూడా తమన్నాపైకి దూసుకువెళ్లాడు. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి జనంలోకి ఏదో అయ్యిందనే మెసేజ్ వెళ్లేలా చేస్తున్నావ్.. ఏం జరిగిందో చెప్పు అంటూ అలీని నిలదీసింది. అయితే కాసేపటి అలీ వచ్చి హిమజతో కూల్‌గా మాట్లాడటంతో పరిస్థితి సద్దుమణిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu