HomeTelugu Big Storiesబిగ్‌బాస్ తెలుగు 17వ(ఆగస్ట్ 6) ఎపిసోడ్ హైలైట్స్‌

బిగ్‌బాస్ తెలుగు 17వ(ఆగస్ట్ 6) ఎపిసోడ్ హైలైట్స్‌

14a
బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు 16 ఎపిసోడ్‌‌లు పూర్తయి 17వ ఎపిసోడ్‌ ఇవాళ (ఆగస్ట్ 6) ప్రసారమైంది. ఇక ఈవారం నామినేషన్‌‌‌కి ఐదుగురు నామినేట్ కావడం.. ఈసారి నామినేషన్ ప్రక్రియ ఓపెన్‌గా పెట్టడంతో హౌస్‌లో హీట్‌ పెరిగింది. తనను రవికృష్ణ నామినేట్ చేశాడనే కోపంతో తమన్నా తనను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. గత ఎపిసోడ్‌ మాదిరే నీచమైన వ్యాఖ్యలు చేస్తూ రవికృష్ణను రెచ్చగొట్టింది. నేను హౌస్‌లో ఉండేది మహా అయితే 5 రోజులు. నా శత్రువు రవికృష్ణను మాత్రం వదిలిపెట్టను అంటూ పర్సనల్ అటాక్ చేసింది తమన్నా.

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే అంటూ తమన్నా రెచ్చిపోయింది. తమన్నా ఎంత రెచ్చగొట్టినా రవికృష్ణ స్పందించక పోవడంతో వీడిని ఏమన్నా స్పందించడు.. వీడు మగాడే కాదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. నవ్వులో కూడా దమ్ములేదు.. రేయ్ పప్పూ అంటూ రెచ్చగొట్టింది. ఆమె ఎంత చేసినా రవికృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ బాబా భాస్కర్‌ను గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చంద్రముఖి వేశం వేస్తా.. పశుపతి.. అంటూ ఏదోదో పిచ్చిగా వాగుతూనే ఉంది. ముందుగా జర్నలిజం కూడా యాక్టింగ్ అంటూ శివజ్యోతిపై నోరు పారేసుకున్న తమన్నా.. తన మాటల దాడిని పెంచడంతో శివజ్యోతి ధీటుగా స్పందించింది. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చింది. రోహిణి, శివజ్యోతి, రాహుల్‌, అలీ రెజా ఇలా అందరితో తమన్నా వాగ్వాదానికి దిగుతూనే ఉంది.

రాహుల్, శివజ్యోతిలు రవిక్రిష్ణకు అండగా నిలవడంతో పాటు.. అతి మంచితనం కూడా పనికి రాదని నిన్ను చూస్తే అర్ధమైందని.. పోనీలే పాపం అనుకుంటే తమన్నా ఇలా రెచ్చిపోతుందని స్టార్టింగ్‌లోనే గట్టి వార్నింగ్ ఇస్తే సరిపోతుందని సలహా ఇచ్చింది శివజ్యోతి. ట్రాన్స్ జెండర్స్ తరపున వచ్చి వాళ్లకు స్పూర్తిగా నిలవాల్సిన మీరు ఇలా దిగజారుడుగా ప్రవర్తించడం సరికాదంటూ చురకలేసే ప్రయత్నం చేశారు రాహుల్ సిప్లిగంజ్. అతనితో కూడా తమన్నా వివాదానికి దిగడంతో పాటు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్.. కొడతావా? వచ్చి కొట్టు అంటూ చెలరేగిపోయింది. హౌస్ మొత్తం ఆమె చర్యలను అసహ్యించుకుంటూ గుర్రుగా ఉన్నారు.

ఇక తమన్నా వ్యవహారానికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకే అన్నట్లు బిగ్‌బాస్‌ ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే ఓ టాస్క్‌ను ఇచ్చాడు. తికమకపురంలో ఊరి పెద్ద వరుణ్‌ సందేశ్‌, తమన్నాలు ఉండగా.. పనీపాటా లేని లాయర్‌ హిమజ.. బద్దకస్తుడైన పోలీస్‌ ఆఫీసర్‌ బాబా భాస్కర్‌.. స్ట్రిక్ట్‌ కానిస్టేబుల్‌గా శివజ్యోతి నటించారు. ఇక దొంగలైన అషూ రెడ్డి, శ్రీముఖి, రవికృష్ణ దొంగతనాలు చేస్తుంటే పోలీసులు పట్టుకుని జైల్లో వేయాలని తెలిపాడు. ఇక టాస్క్‌లో భాగంగా ఊరికి సంబంధించిన నిధిలో ఉన్న వస్తువులను, డబ్బును దొంగతనం చేయడమే దొంగల టార్గెట్‌గా ఉండాలన్నాడు.

టాస్క్‌లో భాగంగా ఊరిలోని నిధిని, వస్తువులను దొంగతనం చేసేపనిలో ఆ ముగ్గురూ పడ్డారు. శ్రీముఖిని మాత్రం అరెస్ట్‌ చేయబోయారు. నిధి చుట్టూ రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌ కాపలగా ఉన్నారు. శ్రీముఖి అల్లరి, బాబా భాస్కర్‌ కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో రేపటి ఎపిసోడ్‌లో చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu