HomeTelugu Trendingరెండో ఎలిమినేషన్‌ వరుణ్‌

రెండో ఎలిమినేషన్‌ వరుణ్‌

9 2అలీ ఎలిమినేట్‌ అనంతరం.. స్టేజ్‌ మరోసారి ఆట, పాటలతో దద్దరిల్లిపోయింది. ఇక స్టేజ్‌ పై బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌తో అంజలి, హీరో శ్రీకాంత్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇంటి బయట ఉన్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌లో ఎవరు ఫేవరెట్‌ అని అడిగాడు. శ్రీకాంత్‌ పునర్నవి ఫేవరేట్‌ అని చెప్పాడు. ఇక మనకు మూడు ప్లాన్‌లు ఉన్నాయి అంటూ.. ఒక బాక్స్ ఇచ్చి.. శ్రీకాంత్‌ని లోపలికి పంపించాడు నాగ్‌. ఇంటిలోకి సస్పెన్స్‌తో వెళ్లాడు శ్రీకాంత్‌. నాగ్‌ శ్రీకాంత్‌ దగ్గర ఉన్న బాక్స్‌లో రూ.10 లక్షలు ఉన్నాయి. వాటిని తీసుకుని బయటకు వచ్చేయచ్చు అని అవకాశం ఇచ్చాడు. వారు నిరాకరించడంతో.. వారి ఫ్యామీలి నెంబర్స్‌ అభిప్రాయాలు కూడా అడిగారు. వారు కూడా వద్దు అనే సమాధానం ఇచ్చారు. రెండో ప్రయత్నంగా ఇంకో బాక్సు తీసుకువచ్చాడు. ఇందులో మరో రూ.10 లక్షలు ఉన్నాయి. మొత్తం రూ. 20 లకలు అంటూ.. కంటెస్టెంట్స్‌ని ఊరించారు. దీనికి కూడా కంటెస్టెంట్స్‌ అంగీకరించకపోవడంతో చివరికి వరుణ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. వరుణ్‌ బయటకు రావడంతో ‘టాప్‌-3’ అంటూ.. బాబా, శ్రీముఖి, రాహుల్‌ పండగ చేసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu