HomeTelugu Trendingసోహెల్‌కి జోడిగా సత్యదేవ్ హీరోయిన్

సోహెల్‌కి జోడిగా సత్యదేవ్ హీరోయిన్

Actress roopa as a heroineతెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌ సయ్యద్ సోహెల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. విన్నర్‌ కాకపోయిన అంతకంటే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్‌లో ప్రేక్షకులతో పాటు సెలబ్రెటీలను కూడా ఆకట్టుకున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి సైతం సోహెల్ ను మెచ్చుకున్నారు. తాజాగా సోహెల్ ఇప్పుడు హీరోగా పరిచయం ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. హోళీ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో సోహెల్ కు జోడిగా తెలుగమ్మాయి రూపను ఎంపిక చేశారు. విజయవాడకు చెందిన రూప కొడువాయుర్ కొన్ని సినిమాల్లో నటించిన సత్యదేవ్ తో నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సోహెల్ తో కలిసి స్క్రీన్ పై సందడి చేయనుంది. వీరిద్దరితో విడుదల చేసిన హోళీ పోస్టర్ కలర్ ఫుల్ గా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu