తెలుగు బిగ్‌బాస్‌-4 ప్రోమో.. ఈ కొత్త పాత్ర ఎవరు!


తెలుగు బిగ్‌బాస్‌ షో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో తాజా సీజన్‌-4 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరో ప్రోమో విడుదల అయ్యింది. సీజన్‌-3కు హోస్ట్‌గా చేసిన కింగ్‌ నాగార్జునే ఈ సీజన్‌-4కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంతకుముందు విడుదల చేసిన బిగ్‌బాస్‌ 4 ప్రోమోలో నాగార్జున స్టైలిష్‌గా కనిపించగా ప్రస్తుతం విడుదల చేసిన ప్రోమోలో ఆయన ఓల్డ్‌ లుక్‌లో ఒక బయోస్కోప్‌ పట్టుకొని ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. గోపి అని పిలుస్తారు.

తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ ప్రోమో ముగుస్తుంది. ఇంతకీ అసలు గోపీ ఎవరు? ఈసారి బిగ్‌బాస్‌ తీసుకురాబోతున్న ఈ కొత్త క్యారెక్టర్‌ ఎవరు అని అంతా ఆలోచిస్తున్నారు. సీజన్‌ 3లో నాగార్జున పండు అంటూ ఒక కోతి బొమ్మను చేతితో తీసుకు వచ్చి.. చాలా విషయాలు దాని ద్వారా చెప్పేవారు. అయితే ఈ సారి గోపి అంటూ ఎవరు రాబోతున్నారో చూడాలి. బిగ్‌బాస్‌ 4 ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates