
Bigg Boss Telugu 9 Contestants:
అన్నీ సెట్ అయ్యాయి… మనకు ఎంతో ఇష్టమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పనులు హైదరాబాద్‌లో జోరుగా సాగుతున్నాయి. 2017లో మొదలైన ఈ షో, ప్రతి సీజన్‌లో డ్రమా, కామెడీ, కంటిపడే ఫైట్లు, ఎమోషనల్ మూమెంట్లతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.
ఇక ఈ సీజన్‌లో మళ్లీ హోస్ట్‌గా మన కింగ్ నాగార్జున వస్తున్నారని క్లారిటీ వచ్చింది. మొదట్లో బాలకృష్ణ లేదా విజయ్ దేవరకొండ కూడా హోస్ట్ చేస్తారేమో అన్న వార్తలు వచ్చాయి కానీ ఫైనల్‌గా నాగ్‌గారే ఫిక్స్ అయ్యారు. భారీ రెమ్యూనరేషన్ (రూ.30 కోట్లు కంటే ఎక్కువ!) తీసుకుని ఈసారి మళ్లీ ఎంటర్ అయ్యారు. నాగార్జున గారి స్టైల్, కూల్ యాటిట్యూడ్‌కి ఫ్యాన్స్ క్రేజ్ అంతే లేదు.
ఇక బిగ్ బాస్ 9 స్పెషాలిటీ ఏంటంటే… కొత్తగా సెటప్ చేస్తున్నారు. ముందటి సీజన్స్ కంటే డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా ఉండేలా డిజైన్ చేస్తున్నారని బజ్. కొత్త టాస్కులు, ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్‌తో ఈసారి ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అని టాక్!
కాంటెస్టెంట్స్ విషయానికి వస్తే – బుంచిక్ బబ్లూ, కుమారి ఆంటీ, రమ్య మోక్ష లాంటి పేర్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇంకా అధికారిక లిస్టు వచ్చేది కాదు కానీ, ఈ పేర్లు నెట్‌లో బాగా వైరల్ అవుతున్నాయి.
షో ఆగస్టు లేదా సెప్టెంబర్ 2025లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలో పెద్ద సినిమాలు కూడా లేవు, క్రికెట్ టోర్నీ కూడా లేదు. కాబట్టి ఫుల్ ఫోకస్ బిగ్ బాస్ పైనే ఉంటుంది!