
Bigg Boss Telugu 9 Host:
బిగ్ బాస్ 8 ఎంతగానో హిట్ కాకపోయినా, మంచి రచ్చ మాత్రం చేసిందని చెప్పాలి. ఇప్పుడు అదే రచ్చ మరింత హంగులతో బిగ్ బాస్ 9లోకి ఎంటర్ కానుంది. తాజా సమాచారం ప్రకారం, స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఇప్పటికే సిద్ధమవుతోంది. ఈసారి ఆగస్టులో షో స్టార్ట్ కానుందట!
అయితే, అసలైన సస్పెన్స్ షో హోస్ట్ విషయంలోనే జరిగింది. మొదటగా వినిపించిన వార్తల ప్రకారం బాలకృష్ణ ఈసారి హోస్ట్‌గా వచ్చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. నాగార్జున తప్పుకున్నారనే గాసిప్స్ కూడా బలంగా వినిపించాయి. కానీ ఇప్పుడు ప్లాట్ తలకిందులయ్యింది!
లేటెస్ట్ బజ్ ప్రకారం నాగార్జున మళ్లీ హోస్ట్ చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. నిజానికి మొదట నాగ్ ఈసారి చేయాలన్న ఇంట్రెస్ట్ చూపలేదట. కానీ, స్టార్ మా వర్గాలు ఆయనకు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో చివరికి ఒప్పుకున్నారట. ఇప్పుడిప్పుడే షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయంట.
ఇదే వార్త సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. నాగార్జున స్టైల్, టైమింగ్ పంచ్‌లు మిస్ అయిన బిగ్ బాస్ 8కి ఇప్పుడు మళ్లీ లైఫ్ వచ్చిందన్నట్టే. ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయాల్సి ఉంది కానీ, అభిమానులంతా ఇప్పటికే జంప్ అయిపోయారు!
ఇంతలో కంటెస్టెంట్ల పేర్లు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈసారి కొత్త కంటెస్టెంట్లతో పాటు కొంతమంది పాపులర్ ఫేసెస్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందట. మరి ఈ సీజన్ బిగ్ హిట్ అవుతుందా? వేచి చూద్దాం!