HomeTelugu Trendingబిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కి కరోనా.!

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కి కరోనా.!

Bigg Boss 4 telugu contesta
తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-4 త్వరలో ప్రారంభం కానుంది. ఈమేర‌కు ఏర్పాట్ల‌న్నీ జ‌రిగిపోయాయి. కాగా ఇప్ప‌టికే 16 మంది కంటెస్టెంట్స్‌ ఎంపిక చేసి.. వారికి కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నెగెటివ్ అని నిర్థార‌ణ అయ్యాక‌ ఓ స్టార్ హోట‌ల్‌లో ఉంచినట్లు తెలుస్తుంది. హోస్ట్‌ కింగ్‌ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా.. ఆగస్టు 29 లేదా 30న షో ప్రారంభం కాబోతుందని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఓ షాకింగ్‌ న్యూస్‌ వీక్షకులను కలవర పెడుతోంది. బిగ్‌బాస్‌-4లో కంటెస్టెంట్స్‌లో ఒకరికి కరోనా వైరస్‌ సోకిందనే వార్త ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కరోనా వైరస్‌ కారణంగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ విషయంలో నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. షోకి ఎంపికైన వారందరికీ ఇప్పటికే కరోనా పరీక్షలు నిర్వహించి, ఓ స్టార్‌హోటల్‌లో క్వారంటైన్‌ చేశారు. అయితే తాజాగా నిర్వహించిన టెస్టుల్లో షోలో పాల్గొనే ఓ సింగర్‌కి పాజిటివ్‌గా నిర్థారణ అయిందట. ప్ర‌స్తుతం ఆ సింగర్‌కి బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ప్ర‌త్యేక చికిత్స అందిస్తున్నార‌ట‌. కాగా షో ప్రారంభం వ‌ర‌కు స‌ద‌రు కంటెస్టెంట్‌కి నెగెటివ్ అని నిర్ధార‌ణ అవుతుందా? లేదా అన్న‌ది మేక‌ర్స్‌ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంద‌ట‌. ఒకవేళ షో ప్రారంభ సమయానికల్లా ఆయనకు నెగిటివ్‌ రాకపోతే.. అతని స్థానంలో మరోకరిని తీసుకుంటారని సమాచారం. కాగా ఈ సీజన్‌లో సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యూట్యూబర్లు అలేఖ్య హారిక, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌లు కంటెస్టెంట్‌లుగా ఉండబోతున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!