కౌశల్ డైరెక్షన్‌లో.. బిగ్‌బాస్ ఫ్యామిలీతో రోల్ రైడా ఆల్బమ్‌!

తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోకి రాపర్ రోల్ రైడా ఎంటరవ్వడానికి ముందే పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ‘పతంగ్’, ‘శంకర్ కా బేటా’ లాంటివి మంచి ఆదరణ పొందాయి. గతవారం బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన రోల్ రైడా….ఈ రియల్టీ షో పూర్తయిన అనంతరం 16 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఓ మ్యూజిక్ ఆల్బం ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇంట్లో ఉన్నపుడే తాను ఈ విషయమై కౌశల్, ఇతర ఇంటి సభ్యులతో చర్చించినట్లు రోల్ రైడా వెల్లడించాడు. బిగ్ బాస్ సీజన్ 2, అందులోని సభ్యులు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోవాలనే ఇలా ప్లాన్ చేస్తున్నట్లు రోల్‌ తెలిపాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంతా కలిసి చేసే ఈ మ్యూజిక్ ఆల్బంకు డైరెక్షన్‌ వహించడానికి కౌశల్ ఆసక్తిగా ఉన్నారని, తాను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడే ఈ విషయమై చర్చించుకున్నామని రోల్ రైడా వెల్లడించాడు.

మేము చేసే మ్యూజిక్ ఆల్బంకు నాని అన్నను కూడా ఇన్వైట్ చేయాలనే ఆలోచన ఉన్నాము అని అన్నాడు. మా అందరికీ ఎప్పటికీ ఒక స్వీట్‌ మొమెరీగా ఉండేట్లు దీన్ని ప్లాన్ చేస్తున్నాం. ఇది తప్పకుండా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నామని రోల్ రైడా తెలిపాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు కొందరి మధ్య కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి. అయితే బయటకు వచ్చిన తర్వాత అందరూ వస్తారా? లేదా? అనే విషయంలో ఓ చిన్న అనుమానం అయితే ఉంది. ఏం జరుగుతోందో చూడాలి. గేమ్ ను గేమ్ లాగా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా కలిసి ఉంటే మంచిది అని నా ఉద్దేశ్యం అన్నారు రోల్ రైడా. బిగ్ బాస్ హౌస్‌లో చాలా మంది యాక్టర్లు ఉన్నారు. కొందరు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తర్వాత షూటింగ్ మిస్సవుతున్నట్లు ఫీలయ్యారు. ఆ సమయంలో బిగ్ బాస్ ఫిల్మ్ తీయాలని టాస్క్ ఇవ్వడంతో అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు, ఆ షూటింగును చాలా ఎంజాయ్ చేశారు.