HomeTelugu Trendingసల్మాన్‌ ఖాన్‌, కరణ్ జొహార్‌తో సహా ఆరుగురిపై కేసు..

సల్మాన్‌ ఖాన్‌, కరణ్ జొహార్‌తో సహా ఆరుగురిపై కేసు..

6 16
యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు 8 మంది బాలీవుడ్ ప్రముఖులు కారణమంటూ అతని స్వరాష్ట్రమైన బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుశాంత్ బాలీవుడ్ మాఫియాకు బలయ్యాడంటూ సుధీర్ కుమార్ ఓఝా అనే లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అతని సినిమాలు విడుదల కాకుండా చేశారన్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు. హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్‌ కరణ్ జొహార్, సంజయ్ లీలా భన్సాలీ , నిర్మాత ఏక్తా కపూర్ సహా నలుగురిని నిందితులుగా చేర్చారు. వీరు పెట్టిన హింస కారణాంనే సుశాంత్ మానసిక ఆందోళనతో ప్రాణం తీసుకున్నాడని ఆరోపించారు.

తమకు పోటీగా వస్తున్నాడనే అసూయతో వీరు సుశాంత్ సింగ్‌ను వేధించారని వివరించారు. కాగా ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజయ్ నిరుపమ్ స్పందిస్తూ.. సుశాంత్ 7 సినిమాలను నష్టపోయాడని, అది కూడా 6 నెల్లలోనే ఇది జరిగందని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక సుశాంత్ మరణంపై కంగనా‌, అభినవ్ కశ్యప్‌, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు స్పందిస్తూ.. బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతిపై విమర్శలు చేశారు. ఓ వర్గానికి చెందిన వారి వల్లే సుశాంత్ చనిపోయాడని వారు సైతం ఆరోపించారు. బీహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో జూన్ 16 ఉదయం పిటీషన్ వేయగా.. పైన పేర్కొన్న ఎనిమిది మందికి కఠిన శిక్ష వేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. వీరిపై 306, 109, 504, 506 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు సుధీర్ కుమార్. మరి ఈ కేసును కోర్టు అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!