జాన్వీని ఇబ్బంది పెట్టిన డ్రెస్!

దఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురు కావడంతో బాలీవుడ్ లో ఈజీగా అవకాశాలు వస్తాయి. ధర్మ ప్రొడక్షన్లో దఢక్ తరువాత మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేసింది ఈ అమ్మడు. ఈ సినిమాలు ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో.. ఖాళీ సమయంలో అవార్డుల వేడుకలకు ఫ్యాషన్ షోలకు హాజరవుతూ బిజీగా మారిపోయింది.

స్టార్టింగ్ స్టేజిలోనే ఉన్న ఈ అమ్మడు నటన కంటె అందానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి. దీంతో ఫ్యాషన్ షోలకు ఎక్కువగా హాజరువుతన్నది. ఇటీవలే జరిగిన వోగ్ బ్యూటీ అవార్డుల వేడుకల్లో తళుక్కున మెరిసింది. బ్రౌన్ కలర్ తళుకుబెళుకుల లాంగ్ డ్రెస్ లో కనువిందు చేసేందుకు వచ్చిన ఈ అమ్మడు పాపం ఫోటోలకు పోజులు ఇచ్చే సమయంలో నానా ఇబ్బంది పడింది. డ్రెస్ కాలికి తలగడంతో.. నిలబడేందుకు ఇబ్బందులు పడింది. డ్రెస్ స్టైలిస్ట్ వచ్చి చేశాక పోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ షార్ట్ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నది.