HomeTelugu Trendingవిచారణకు బాలీవుడ్‌ దర్శకుడు‌

విచారణకు బాలీవుడ్‌ దర్శకుడు‌

Director anurag kashyap att
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఇటీవల నటి పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది. లైంగిక వేధింపులకు గురి చేసి, మరోవైపు ఆయన స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారని, ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

కాగా ఇటీవల ఆమె మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారికి కూడా ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయానికీ ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో అనురాగ్‌ కశ్యప్‌కు పోలీసులు సమన్లు పంపినట్లు తెలిసింది. ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్ ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. పోలీసులకు ఆయన ఈ కేసుపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, పాయల్‌ ఘోష్‌కు పలువురు సినీ ప్రముఖుల నుంచి మద్దతు వచ్చిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!