బయోపిక్‌ను నిర్మిస్తున్న సల్మాన్‌ఖాన్


సల్మాన్ ఖాన్ కు మాస్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందొ చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో భారీ హిట్ అవుతుందన్న రేస్ 3 సినిమా పరాజయం పాలవ్వడంతో.. సల్మాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ భారత్ సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఈద్ కు రిలీజ్ కాబోతున్నది.

ఇదిలా ఉంటె, సల్మాన్ ఖాన్ బుల్లితెరపై సంచలనం సృష్టించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే కపిల్ శర్మ షోను ప్రొడ్యూస్ చేసిన సల్మాన్, మల్లయుద్ధ యోధుడు మహ్మద్ గులామ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సీరీస్ ను నిర్మించబోతున్నారు. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ఈ సీరీస్ లో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారట. ఏప్రిల్ నుంచి పంజాబ్, లండన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. జులై లో ఈ సీరీస్ ప్రసారం చేస్తారట. ఎన్ని సీజన్స్ లో బయోపిక్ సీరీస్ ప్రసారం అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.