అల్లు అర్జున్‌కి బాలీవుడ్ ఆఫర్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ నుండి బంపఫ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. బన్నీ చేసిన ‘సరైనోడు, దువ్వాడ జగన్నాథం, రేసు గుర్రం’ వంటి చిత్రాల హిందీ వెర్షన్లు యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కించుకున్నాయి. అల్లు అర్జున్‌ సినిమాలంటే హిందీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే బన్నీకి బంపఫ్ ఆఫర్ వచ్చిందట.

కబీర్ ఖార్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ చేయనున్న ’93’ సినిమాలో బన్నీకి కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర చేసే అవకాశం వచ్చిందట. 1993 ఇండియా టీమ్ వరల్డ్ కప్ విజయం చుట్టూ తిరిగే ఈ కథలో రణ్వీర్ కపిల్ దేవ్ పాత్రను చేస్తున్నారు. ఈ ఆఫర్ ను గనుక అల్లు అర్జున్ ఒప్పుకుంటే ఆయన మొదటి స్ట్రయిట్ హిందీ సినిమా ఇదే అవుతుంది.