HomeTelugu Trendingఐశ్వర్య రాజేశ్‌ 'భూమిక' ట్రైలర్‌

ఐశ్వర్య రాజేశ్‌ ‘భూమిక’ ట్రైలర్‌

Boomika Trailer

ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్‌ మూవీ ‘భూమిక’. రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌ డైరెక్షన్‌ లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 23నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌2 ని విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్‌ 1లానే ఇది ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దట్టమైన అడవి లొకేషన్‌, భూమి గురించి వివరించే సంభాషణతో ప్రారంభమవుతుంది ఈ ట్రైలర్‌. ఓ రోడ్డు ప్రమాదం, ఓ హత్య, ఛేజింగ్‌ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఐశ్వర్య రాజేశ్‌ నటన మెప్పిస్తుంది. ప్రకృతి గొప్పతనాన్ని తెలియజేసే చిత్రమిది. స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై కార్తికేయన్‌ సంతానం, సుందరం, జయరామన్‌ నిర్మించారు. కార్తీక్‌ సుబ్బరాజు సమర్పిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu