HomeTelugu Trendingహిట్‌ కాంబినేషన్‌లో మరోసారి అల్లు అర్జున్‌

హిట్‌ కాంబినేషన్‌లో మరోసారి అల్లు అర్జున్‌

9 15టాలీవుడ్ లో టాప్ హీరోలందరితో బోయపాటి సినిమాలు చేశారు. అల్లు అర్జున్ తో బోయపాటి సరైనోడు సినిమా చేశారు. ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ విజయం తరువాత బోయపాటితో బన్నీ మరో సినిమా చేయలేదు.

గత కొంతకాలంగా బోయపాటి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. జయ జానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫెయిల్ కావడంతో.. బాలకృష్ణతో చేయాల్సిన సినిమా వాయిదా పడింది. సినిమాను అనౌన్స్ చేసి ఎందుకు ఆపేశారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటె, కార్తికేయ హీరోగా చేసిన గుణ 369 ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ బోయపాటితో సినిమా ప్రస్తావన తెచ్చారు. త్వరలోనే సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. కార్తికేయకు కూడా అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు. అయితే, అల్లు అరవింద్.. బోయపాటి సినిమాలో ఎవరు హీరో అన్నది తెలియాల్సి ఉన్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu