HomeTelugu Big Stories'బ్రో' టీజర్‌

‘బ్రో’ టీజర్‌

BRO Movie Teaser
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి తొలిసారి నటించిన చిత్రం బ్రో. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ ఎంటర్టయినర్ మూవీ నుంచి ఈ రోజు టీజర్ రిలీజైంది. పవన్ గెటప్పులు, డైలాగులు సినిమాలో ఎలా ఉంటాయో ఈ టీజర్ లో శాంపిల్ గా చూపించారు.

పవన్… సాయితేజ్ ను టీజ్ చేయడం… చిన్న పిల్లాడ్ని బ్రో అంటూ సాయితేజ్ తనదైన కామెడీ టైమింగ్ తో చెప్పిన డైలాగ్… కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం అంటూ పవన్ ఫిలాసఫికల్ డైలాగ్ విసరడం.. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజికల్ గా ఉంటుందనడంలో సందేహంలేదు.

టీజర్ విడుదలైన గంటలోనే 1.2 మిలియన్ల వ్యూస్ సంపాదించిందంటే బ్రో మేనియా ఎలా ఉందో అర్థమవుతోంది. కాగా, ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ టీజర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం వ్యూహం టీజర్‌

సామజవరగమ మూవీ ట్రైలర్‌

రుద్రంగి మూవీ ట్రైలర్‌

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu