Homeతెలుగు Newsచంద్రబాబు కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే: వెంకన్న

చంద్రబాబు కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే: వెంకన్న

12 2ఇంటిమీద బీజేపీ జెండా.. ఇంట్లో వైసీపీ జెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డబుల్ గేమ్‌ ఆడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఏదో ఒక రోజు కన్నా వైసీపీలో చేరడం ఖాయమని అన్నారు. అవినీతి ఆస్తులు కూడబెట్టి గుంటూరు జిల్లాలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన కన్నా.. ముఖ్యమంత్రిపై అసంబద్ధ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ‘నాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చేయి చూపిస్తున్నారు. నన్ను హతమార్చాలని మీరు చూసినా పోలీసుల రక్షణ కోరను. చంద్రబాబు కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే’ అని వెంకన్న అన్నారు. అగ్రీగోల్డ్‌ను భ్రష్టు పట్టించింది కన్నాయేనని వెంకన్న అన్నారు. టీడీపీ మీద, తన మీద చేస్తున్నా ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తే ఆత్మహత్యకైనా సిద్ధమేనని చెప్పారు. ఉందో లేదో తెలియని పార్టీకి కన్నా రాష్ట్ర అధ్యక్షుడని ఎద్దేవా చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!