నీ కోసం ఎదురు చేస్తున్నా మిత్రమా: హృతిక్‌ రోషన్‌


ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో హృతిక్ రోషన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. హృతిక్ రోషన్ ట్వీట్‌ చేస్తూ … పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నీకు ఈ సంవత్సరం మొత్తం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను. యుద్ధ భూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నాను మిత్రమా. రాబోయే రోజులు మీకు ఆనందంగా మరియు శాంతితో నిండి ఉండాలని కోరుకుంటున్నాం. మనం కలిసే వరకు… పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ట్విట్టర్ లో ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తెలుగు లో పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. తెలుగు హీరో కి హృతిక్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం ఇదే మొదటి సారి అంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తో ఎన్టీఆర్‌ గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన కొరటాల డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ హిందీ సినిమాలో నటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్’ సీక్వెల్ లో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా హృతిక్ రోషన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates