HomeTelugu Trendingకరోనా కారణంగా 960 మంది విదేశీయుల వీసాలు రద్దు

కరోనా కారణంగా 960 మంది విదేశీయుల వీసాలు రద్దు

9 1

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో మార్చి 13 నుంచి మార్చి 15 వ తేదీ మత ప్రార్ధనలు జరిగాయి. ఈ ప్రార్థనల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పాల్గొన్నారు. అంతే కాకుండా విదేశాల నుంచి సైతం కొందరు టూరిస్టు వీసాలపై వచ్చి ఈ మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది వ్యక్తులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం వారి వారి ప్రాంతాలకు వెళ్లారు. అయితే, టూరిస్టు వీసాలతో వచ్చి మత ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొనడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న సమయంలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు తమ వివరాలను ప్రభుత్వానికి తెలియ చేయలేదు. మత ప్రచారం చేసేందుకు ఇండోనేషియాకు చెందిన కొంతమంది వ్యక్తులు ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని కరోనా పరీక్షలు నిర్వహించగా చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అక్కడి నుంచి తెలంగాణలో కరోనా కలకలం మొదలైంది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులకు ఢిల్లీ మర్కజ్ కు లింక్ ఉండటంతో పాటు మత పరమైన ప్రచారంలో పాల్గొన్న 960 మంది విదేశీయుల వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. వారిని బ్లాక్ లిస్టులో పెట్టింది. వీరిపై చర్యలు తీసుకోబోతున్నట్టు భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu