
Spirit Movie Update:
ప్రభాస్, దీపిక పదుకోన్ జంట ‘కల్కి 2898AD’ లో చూసిన ప్రేక్షకులు కొంచెం డిజప్పాయింట్ అయ్యారు. ఇద్దరిలో కెమిస్ట్రీ అంతగా కన్‌విన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు అదే జంట మరోసారి కలుస్తోంది — ఈసారి సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీస్తున్న ‘స్పిరిట్’ సినిమా కోసం!
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే… దీపిక మొదట ఈ ప్రాజెక్ట్ చెయ్యనని చెప్పిందట. ఎందుకంటే అప్పట్లో ఆమె గర్భవతి కాగా, షూటింగ్ షెడ్యూల్ కలవడం కష్టం అయ్యిందట. కానీ తర్వాత వంగా షెడ్యూల్ మార్చి తిరిగి దీపికను కలవడం, ఆమెను కన్‌విన్స్ చేయడం జరిగింది.
వంగా ఈసారి చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ రెడీ చేశాడట. “ఇది వంగా సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమమైన హీరోయిన్ పాత్ర” అని అంటున్నారు పింక్‌విల్లా రిపోర్ట్స్ ప్రకారం. దీపిక కూడా ఆ పాత్రకు మొగ్గుచూపడం వెనుక ఇదే కారణమట.
ఇక అభిమానుల్లో మాత్రం ఒక్కే డౌట్ – ‘కల్కి’లో కెమిస్ట్రీ ఫ్లాప్ అయింది, మరి ‘స్పిరిట్’లో వంగా దాన్ని సెట్ చేస్తాడా? మనకి తెలుసు వంగా తన హీరోల ఎమోషన్స్ ని బాగా చూపిస్తాడు. ఇప్పుడు అదే ఎఫెక్ట్ తో దీపిక పాత్రను కూడా అద్భుతంగా చూపిస్తే, ఈ జంటకి రెండో ఛాన్స్ బాగా వర్కౌట్ అవుతుంది.
ఇదిలా ఉంటే, దీపిక చేతిలో ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి – షారుఖ్ ఖాన్ తో ‘కింగ్’, ‘పఠాన్ 2’, ‘కల్కి 2’… ఇవన్నీ ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో, ఆమె ప్రస్తుతం కెరీర్ హయ్యెస్ట్ పాయింట్ లో ఉంది. ఇక ‘స్పిరిట్’ ఈ లిస్టులో బిగ్ హిట్ అవుతుందా అనేది ఆసక్తికరమైంది!
ALSO READ: Prabhas ఫోకస్ మొత్తం ఈ సినిమా మీదే ఉన్నాయట













