ప్రభాస్ కార్ ఛేజ్ కోసం అంత ఖర్చా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఓ రేంజ్ లో ఉంటాయనే ప్రచారం ఊపందుకుంది. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్ కెన్నీ బేట్స్ ను రంగంలోకి దింపారు.

ఈ సినిమాలో 20 నిమిషాల పాటు కొనసాగే కారు ఛేజ్ సీన్ ఒకటి ఉంటుందట. ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఈ సీన్ ను రూపొందించబోతున్నారు. ఈ ఒక్క సీన్ కోసం దాదాపు 35 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నారనేది తాజా సమాచారం. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో రూపొందిస్తోన్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మంచి హిట్ సినిమాగా మిగిలిపోతుందని చెబుతున్నారు.