టీవీ9 రవిప్రకాశ్‌పై కేసు నమోదు

టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో అలంద మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. ఛానల్‌ నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయని, కొన్ని పత్రాలు ఫోర్జరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా టీవీ 9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్‌ నివాసంలోనూ సీసీఎస్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. టీవీ 9 వాటాల అమ్మకం, యాజమాన్యం మార్పిడికి సంబంధించి కొన్నిరోజులుగా వివాదం కొనసాగుతోంది. టీవీ 9ను అలందమీడియా టేకోవర్‌ చేసిన విషయం తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates